ADB: నేరడిగొండ మండలం రాజుల తాండ గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద ఆధ్యాత్మికవేత్త గురుదాస్ శంకరయ్య ఆధ్వర్యంలో హరిపాటవం, హనుమాన్ చాలీసా పుస్తకాలను మంగళవారం రాత్రి పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడంతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఇప్పటివరకు 100 పైగా గ్రామాల్లో పర్యటించి 13 వేల పుస్తకాలను పంపిణీ చేసినట్లు శంకరయ్య పేర్కొన్నారు.