SRPT: నూతనకల్ మండలం బిక్కుమల్లలో దుండగులు బరితెగించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆదివారం ఉదయం పూజారి వచ్చి చూడగా తలుపులు విరగ్గొట్టి ఉండటంతో ఈ దారుణం వెలుగుచూసింది. సర్పంచ్ మమత అనూప్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.