సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ‘జై భీమ్’ చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ జోడీ, మరో పవర్ఫుల్ సోషల్ డ్రామా కోసం చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా బలమైన సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుందని, జ్ఞానవేల్ చెప్పిన పాయింట్ సూర్యకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.