TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఆరాంఘర్ వద్ద ఫుట్‌పాత్ ఆక్రమణలను పోలీసులు తొలగించారు. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో డ్రైవ్ నిర్వహించి.. జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగేలా వ్యాపారాలు సాగిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.