AP: నటుడు ప్రకాష్ రాజ్‌పై తిరుపతిలో పరువు నష్టం దావా దాఖలైంది. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఈ కేసు వేశారు. రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా కించపరిచేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ప్రకాష్ రాజ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాష్ డిమాండ్ చేశారు.