రోజూ కాటుక, మస్కారా వాడటం వల్ల వాటిలోని రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు కళ్ల సహజ మెరుపును దెబ్బతీస్తాయి. అందుకే ఎప్పుడూ నాణ్యమైన ఉత్పత్తులనే ఎంచుకోవాలి. ఇన్ఫెక్షన్ల భయం ఉంటుంది కాబట్టి మేకప్ కిట్‌ను ఇతరులతో పంచుకోకూడదు. అలాగే కళ్లకు మేకప్ వేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ప్రాథమిక సూత్రం. వీటిని పాటిస్తే అందంతో పాటు కళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.