IPL 2026: గాయంతో టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీని తీసుకుంది. రూ.2 కోట్లకు అతణ్ని తీసుకున్నట్లు హైదరాబాద్ టీమ్ ప్రకటించింది. ముంబై, గుజరాత్ కోసం 14 IPL మ్యాచ్‌లాడిన గెరాల్డ్ మొత్తం 15 వికెట్లు తీశాడు. అలాగే ప్రొటీస్ తరఫున 18 T20ల్లో 22 వికెట్లు పడగొట్టాడు.