MLG: వెంకటాపురం మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఈనెల 20వ తేదీన జరగనుంది. ఈ మహోత్సవానికి రావాలని BRS జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలతలను ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం లక్ష్మణ్ బాబు రూ. 35,000 విరాళం అందజేసి తన భక్తిని చాటుకున్నారు.