WGL: జిల్లాలోని CKM, నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచినీటి కొరత తీవ్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగులు, వారికి ఆసుపత్రి ఆవరణంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో నీటి సౌకర్యం లేకపోవడంతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి తక్షణమే మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని కోరారు.