TG: సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, కస్తూర్బా, మోడల్ స్కూల్, గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ కిట్లు అందించేందుకు జారీ చేసిన 9 టెండర్లకు బిడ్ల దాఖలు గడువును ఈ నెల 17 వరకు ఎస్సీ గురుకుల సొసైటీ పొడిగించింది. సాంకేతిక బిడ్ల పరిశీలన అదే రోజు పూర్తవుతుంది. ఆర్థిక బిడ్లను ఈ నెల 20న తెరవనుంది.