TG: వచ్చే నెలలో లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం లిక్కర్ కంపెనీలపై పడింది. గ్యాస్ కొరత కారణంగా మద్యం సీసాల తయారీ ఖర్చు పెరిగిందని నిపుణులు అంటున్నారు. కాగా, లిక్కర్ రేట్లను 12–15 శాతానికి పెంచాలని కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.