KMM: జిల్లాలో గ్యాస్ ధరలు పెరగడం, సరఫరా సమస్యలతో చిన్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూసుమంచి ప్రాంతంలో ఓ హోటల్ యజమాని గ్యాస్ అందుబాటులో లేక కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నాడు. రోజూ కట్టెల కోసం దూరం వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నాడు. రాయితీ గ్యాస్ సిలిండర్లు అందించాలని ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.