MNCL: బెల్లంపల్లి పట్టణం 4వ వార్డులో శనివారం రాత్రి డంప్ యార్డులో చెత్త తగులబడి దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో వార్డ్ ప్రజలు కౌన్సిలర్ ఈట కమలకు సమాచారం ఇచ్చారు. వారు మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి వాటర్ ట్యాంక్ ద్వారా మంటలు చల్లార్చారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న పొగతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు వాపోయారు.