BHNG: చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఆందోల్ మైసమ్మ గుడి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. SI ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్(50) అనే వ్యక్తి గత కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం గుడి సమీపంలోని హాల్లో అపస్మారక స్థితిలో కనిపించాడు, పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.