MNCL: చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో కుంటుపడిందని జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 100 పడకల ఆసుపత్రి, బస్ డిపో నిర్మాణం, నూతన రహదారులు, డ్రైనేజీలు, ఇతర పనులు పెండింగ్ పడ్డాయని ఆరోపించారు. గతంలో తాము అధికారంలో ఉండగా తెచ్చిన నిధులతోనే మంత్రి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారన్నారు.