NZB: ఆలూర్ మండలం గుత్ప తాండలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఇవాళ భూమిపూజ చేశారు. మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా రూ.10 లక్షలు మంజూరు అయినట్లు సర్పంచ్ కొర్ర కిషన్ తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు.