BHPL: CM రేవంత్ రెడ్డి రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం కాళేశ్వరం చేరుకుని ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం మేడిగడ్డను సీఎం సందర్శించి బ్యారేజీని సందర్శించి అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. ఆ తర్వాత నస్తూరుపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు.