NGKL: రైతుల ఖాతాలలో రేపు రెండో విడత రైతు భరోసా నిధులు జమ అవుతాయని నాగర్ కర్నూల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యశ్వంత్ రావు తెలిపారు. సోమవారం భూపాలపల్లి జిల్లాలో జరిగే బహిరంగ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేస్తారని తెలిపారు. జిల్లాలో 2.5 లక్షల మందికి రూ. 103 కోట్లు రైతుల ఖాతాలో జమ కానున్నాయని పేర్కొన్నారు.