అన్నమయ్య: గాలివీడు మండలంలో ఎస్ఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదే సమయంలో సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి చలానాలు విధించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.