PDPL: మంథని పట్టణంలో రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు ఈనెల 25 నుంచి 27 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా గౌడ సామాజిక వర్గీయులు ఆదివారం పట్టణంలోని గ్రామదేవతలు పెద్ద పోచమ్మ, మదున పోచమ్మ, మల్లెపూల పోచమ్మలకు పూజలు నిర్వహించారు. బోనాలు, కళ్యాణానికి ముందు గ్రామ దేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తుందని కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్ తెలిపారు.