LSGతో మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు ప్రియాంష్ ఆర్య, కూపర్ కనోలీ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఆర్య.. 37 బంతుల్లో 9 సిక్సర్లు, 4 ఫోర్లతో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు కనోలీ 46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 87 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ రెండో వికెట్కు కేవలం 80 బంతుల్లోనే 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.