KNR: హుజురాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, వెంటనే డంపింగ్ యార్డ్ రద్దు చేస్తున్నామనే ప్రకటన చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. డంపింగ్ యార్డ్ రద్దు కోసం జేఏసీ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా జరుగుతున్న ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.