GDWL: మల్దకల్ మండలం ఆదిశిలా క్షేత్రంలోని విద్యా మాన్య విద్యాపీఠంలో భక్తుల సౌకర్యార్థం మినీ కళ్యాణ మండప నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. శ్రీ ఉడిపి పలిమారు మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ విద్యాపీఠం కోసం దేవాలయ వ్యవస్థాపక వంశీయులు కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, పద్మావతి దంపతులు విరాళంగా ఇచ్చిన స్థలంలో ఇప్పటికే వేద పాఠశాల నిర్మించారు.