MDK: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులతో పాటు వొకేషనల్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మే 13 నుంచి 21 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ కళాశాలల్లో ఫీజె చెల్లించాలని కోరారు.