MDCL: ఘట్కేసర్లో దోమల బెడద రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా శ్రీనివాస నగర్, అంబేద్కర్ విగ్రహం పరిసరాలు, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతం, ఘట్కేసర్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. నిల్వ నీరు, చెత్త పేరుకుపోవడం కారణంగా దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. వెంటనే ఫాగింగ్, శానిటేషన్ చర్యలు చేపట్టి ప్రజలను రక్షించాలంటూ స్థానికులు కోరారు.