NRPT: మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులు వారి సహాయకుల కోసం తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని సోమవారం వాటర్ మిషన్ను ప్రారంభించారు. దాత అక్కల రాకేష్ సహకారంతో సుమారు రూ.30 వేల విలువైన ఈ మంచినీటి మిషన్ను ఆసుపత్రి ఇంఛార్జ్ డా. వినీతతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.