W.G: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి 2026 ఏడాదికి గాను రెడ్ క్రాస్ గవర్నర్ అవార్డు లభించింది. జిల్లాలో రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు, నిధుల సమీకరణలో ఆమె చూపిన కృషికి ఈ గుర్తింపు దక్కింది. మే 8న విజయవాడలో గవర్నర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకోనున్నారు. జిల్లాకు వరుసగా నాలుగోసారి ఈ పురస్కారం రావడం విశేషం.