ADB: జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ లో రిసెప్షనిస్తుల పాత్ర కీలకమైనదని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో రిసెప్షన్ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును ఆన్లైన్ లో నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.