LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. మార్క్రమ్ వేసిన 13వ ఓవర్లో కూపర్ కనోలీ తొలి 3 బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. చివరి రెండు బంతులకు ప్రియాంష్ ఆర్య మరో రెండు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 32 పరుగులు వచ్చాయి. కాగా, సెంచరీ దిశగా సాగుతున్న ఆర్య(93), కనోలీ(87) వికెట్లను PBKS వరుస ఓవర్లలో కోల్పోయింది.