SRPT: జిల్లాలో రేపటి నుండి 27 వరకు జరగనున్న ఓపెన్ స్కూల్ పరీక్షల నేపథ్యంలో ఎస్పీ నరసింహ 163 BNSS సెక్షన్ విధించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో గుంపులను నిషేధించారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.