TG: హైదరాబాద్ MMTS రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యంపై రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై రైల్వే శాఖ సానుకూలంగా ఉన్నా, తుది నిర్ణయం రైల్వే బోర్డు ఆమోదంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ అంశం ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉందని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.