VSP: సింహాచలం చందనోత్సవం నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. అడవివరం, న్యూ గోశాల, శ్రీనివాసనగర్, సింహపురి కాలనీ పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలపాలన్నారు. అక్కడి నుంచి ఉచిత బస్సుల్లో కొండపైకి వెళ్లాలని సూచించారు. గోపాలపట్నం వైపు వచ్చే ఆటోలను మేకతోట వరకే అనుమతిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సహకరించాలని పోలీసులు కోరారు.