MDK: నిజాంపేట మండలంలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారింది. పగలు 45 డిగ్రీల ఎండతో ఉక్కిరిబిక్కిరైన జనం, సాయంత్రం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో ఉపశమనం పొందారు. అయితే, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట పాడవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.