KNR: వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరుకైన భవనాల్లో గర్భిణులు, బాలింతలు, సిబ్బంది కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటిపూట బడి అమలుచేసింది. కరీంనగర్ జిల్లాలో 777 కేంద్రాల్లో ఉ. 8 నుంచి మధ్యహ్నం 12.30 వరకు నిర్వహిస్తున్నారు. కాగా, మే నెలలో పూర్తిస్థాయి వేసవి సెలవులు ప్రకటించారు.