SRD: పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి శనివారం రాత్రి దిగవనున్న మంజీరా నదిలోకి నీటిని గేటు ద్వారా విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. వేసవికాలం తాగునీటి అవసరాల నిమిత్తం ఈ నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.