IPL 2026 సీజన్లో వరుస ఓటముల పాలవుతున్న కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్యా రహానేకు మరో షాక్ తగిలింది. నిన్న CSKతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి IPL నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో ఒకటి వర్షం కారణంగా రద్దు కాగా, నాలుగింట KKR ఓటమి చెందడం గమనార్హం.