రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ జాతీయులతో వెళ్తున్న పడవ అండమాన్ వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 250 మంది గల్లంతయ్యారు. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్ నుంచి బయలుదేరిన పడవ మలేషియాకు వెళ్తుండగా ఘటన జరిగింది. బలమైన గాలులు, సామర్థ్యానికి మించి ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అధికారులు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు.