MHBD: కొత్తగూడ మండలం కొత్తపల్లిలో పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై మంగళవారం అవగాహన కల్పించారు. కుటుంబ భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సీఐ వినయ్ కుమార్ సూచించారు. గోవిందాపురం, పెగడపల్లి గ్రామాల్లో 100% హెల్మెట్ వినియోగం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.