WGL: నగరంలోని ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న రెండు సబ్ రిజిస్ట్రార్ పోస్టుల కోసం ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు లాబీయింగ్ జరుగుతోందని సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసినవారు, ఇతర ప్రాంతాల సబ్ రిజిస్ట్రార్లు ఈ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.