భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య క్రమశిక్షణ, అంకితభావానికి నిలువెత్తు రూపం. సామాన్య కుటుంబంలో పుట్టి, తన మేధస్సుతో కృష్ణరాజ సాగర్ వంటి అద్భుత కట్టడాలను నిర్మించి ‘ఆధునిక భారత నిర్మాణ శిల్పి’గా పేరుగాంచారు. నీటి పారుదల రంగంలో ఆయన కనిపెట్టిన ‘ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్’ ప్రపంచానికే ఆదర్శం. ‘పనియే దైవం’ అని నమ్మి, 101 ఏళ్ల వయసు వరకు దేశ సేవకే అంకితమయ్యారు.