JEE మెయిన్ 2026 తుది విడత పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. దాదాపు 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల కీపై అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి అభ్యంతరానికి రూ.200 ఫీజు చెల్లించాలి. నిపుణుల కమిటీ వీటిని పరిశీలించిన తర్వాత ఏప్రిల్ 20 నాటికి తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.