బీహార్‌లోని కతిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, బస్సు, వ్యాన్ ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.