VKB: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో తాండూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం రెడ్డి పంజుగుల నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ప్రకటన చేశారు.