WNP: అవగాహనతోనే ఎయిడ్స్‌ను నిర్మూలించవచ్చని మోజర్ల ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డా. బేబీ రాణి తెలిపారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాలెం గ్రామంలో కళాశాల విద్యార్థులతో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల సామాజిక చొరవ అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.