GDWL: మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి బూడిదపాడు గ్రామానికి చెందిన రాజు దంపతులు ఐదు గొడుగులు బహుకరించారు. ఆలయ ఆవరణలో పల్లకి సేవ, రథోత్సవ కార్యక్రమం నిర్వహించి, ఆ గొడుగులను స్వామివారి సేవలో వినియోగించారు. అనంతరం అర్చకులు, వాల్మీకి పూజారుల సమక్షంలో స్వామివారికి గొడుగులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.