ADB: రైతులు తమ పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. రైతులను దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.