దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న JEE MAIN 2026 సెషన్-2 ఫలితాలను కాసేపట్లో NTA అధికారికంగా వెల్లడించనుంది. APRలో జరిగిన ఈ పరీక్షల ఫైనల్ ఆన్సర్ కీతో పాటు, అభ్యర్థుల స్కోర్‌కార్డులు, ఆలిండియా ర్యాంకులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. సెషన్-1, 2లలో విద్యార్థులు సాధించిన పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ఖరారు చేస్తారు.