KMM: మధిర మండలం నాగవరపాడు గ్రామ ఎంపీ యుపిఎస్ పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరమ్మ, ఉప సర్పంచ్ వీరస్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనం ఉచిత పుస్తకాలు యూనిఫామ్లు అందజేస్తామన్నారు.