AP: సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఏళ్లు గడిచే కొద్దీ ప్రజాసేవపై చంద్రబాబు తపన మరింత బలపడుతోందని అన్నారు. అనుభవం దూరదృష్టితో ముందుండి నడిపిస్తున్న తీరు ఆదర్శప్రాయమన్నారు. కష్ట సమయంలో పట్టుదల, ప్రజల పట్ల అంకితభావం మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. ఆయన ఎల్లప్పుడు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.