KRNL: పెద్దకడబూరు మండలం జాలవాడిలోని శ్రీ భీమరాయ స్వామి ఆలయం పక్కన పారిశుద్ధ్య పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఆర్ఎంపీ వైద్యులు వాడిన సిరంజీలను అక్కడే ఉన్న డ్రైనేజీలో పడవేయడంతో సమీప ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకర వైద్య వ్యర్థాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.